'పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి'

'పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి'

SRD: పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. ఇవాళ జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేలా చూడాలని పేర్కొన్నారు.