VIDEO: నేతన్నల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే
TPT: వెంకటగిరిలో చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. పట్టణంలోని బంగారుపేటలో నేతన్నలతో సమావేశమై, పథకాల పత్రాలు పంపిణీ చేశారు. నేతన్నల ఇళ్లకు వెళ్లి మగ్గాలను పరిశీలించి, పింఛన్లు అందజేశారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఉందన్నారు.