మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశం అభివృద్ధి: ఎస్పీ
VKB: మహిళలు విద్య, ఉద్యోగం ఆర్థిక రంగాల్లో అభివృద్ధి దిశగా పయనించినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు తీస్తుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.