‘చండ్రపుల్లారెడ్డిని యువత ఆదర్శంగా తీసుకోవాలి’
KRNL: కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ తాలూకా కార్యదర్శి నరసప్ప పేర్కొన్నారు. ఆయన రచనలు విప్లవాన్ని ఉత్తేజపరిచేవని కొనియాడారు. పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 19న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేధావుల ఆధ్వర్యంలో ఆయన రచనల పుస్తకావిష్కరణ జరుగుతుందని నరసప్ప తెలిపారు.