బస్సు సర్వీస్ ప్రారంభించాలని వినతి
NZB: సిరికొండకు ఆర్మూర్ డిపో నుంచి బస్సు సర్వీసు ప్రారంభించాలని కోరుతూ వీడీసీ సభ్యులు శనివారం డిపో మేనేజర్ రవి కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆర్మూర్ నుంచి భీమ్‌గల్ మీదుగా బస్సు నడపాలని వారు కోరారు. దీనిపై మేనేజర్ రవికుమార్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సిరికొండకు బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.