అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసిన ఎస్సై

అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసిన ఎస్సై

KMM: అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా వైరా మున్సిపాలిటీ 8వ వార్డులో ఈరోజు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఎస్సై పుష్పాల రామారావు, కౌన్సిలర్ చిలక చిన్నకోటయ్య కలిసి విగ్రహాన్ని స్వయంగా నీటితో కడిగి శుభ్రం చేశారు. రేపు జరగనున్న జయంతి ఉత్సవాలకు వార్డులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కౌన్సిలర్ తెలిపారు. మహనీయుల జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలని ఎస్సై పేర్కొన్నారు.