జెత్వానీకి ఎస్కార్టు ఎందుకు?: వెల్లంపల్లి

కృష్ణా: దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మిని రోడ్డుపై నిలిపేసి, నటి కాదంబరి జెత్వానీని ఎస్కార్ట్‌తో పంపడం దారుణమని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు జరుగుతున్న తీరు చూస్తుంటే బాధేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.