ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్
ADB: ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ, రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల పురోగతి, తదితర అంశాలపై సమీక్షించారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని ఆకస్మిక తనిఖీలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.