VIDEO: 'బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి'
MNCL: రాష్ట్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, కార్యదర్శి భీమ్ సేన్ కోరారు. మంగళవారం మంచిర్యాలలో వారు మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఫెడరేషన్లకు పాలక మండళ్లు నియమించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.