రాంతీర్థ్ శివారులో మహిళ హత్య

SRD: కంగ్టి మండలం రాంతీర్థ్ శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఎస్సై దుర్గారెడ్డి తెలిపిన వివరాలిలా.. మండలంలోని T. వడగామకు చెందిన నరసమ్మ (45) వితంతువు, రాంతీర్థ్ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే ఆమె తలపై బలంగా రాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు.