‘తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

‘తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

PPM: వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని DMHO భాస్కర రావు సూచించారు. అయన మాట్లాడుతూ.. ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత అధికమై ప్రాణాపాయం కలగొచ్చని హెచ్చరించారు. చెమట పట్టకపోవడం, మగత, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలో తిరగరాదని సూచించారు.