జమ్మికుంట మార్కెట్‌లో నిలకడగా పత్తి గరిష్ట ధర

జమ్మికుంట మార్కెట్‌లో నిలకడగా పత్తి గరిష్ట ధర

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో బుధవారం పత్తి ధరలు సోమవారం లాగే నిలకడగా కొనసాగాయి. నిన్న మార్కెట్ సెలవు కాగా, ఇవాళ రైతులు 9 వాహనాల్లో 43 క్వింటాళ్ల పత్తి తీసుకువచ్చారు. దీనికి గరిష్ఠంగా రూ. 8,050, కనిష్టంగా రూ. 7,000 పత్తి ధర పలికింది. మార్కెట్ అధికారులు, ప్రైవేట్ వ్యాపారులు లావాదేవీలను పర్యవేక్షించారు.