అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. వారం రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులు, కుంటలు బలహీనపడి తెగిపోవచ్చని, అలాంటి ప్రాంతాలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయన అడిగి తెలుసుకున్నారు.