VIDEO: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్: ఎమ్మెల్యే
ATP: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ అన్నారు. అనంతపురంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో మందికి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే చెందుతుందని పేర్కొన్నారు.