డెంకాడ బంగారమ్మ తల్లి వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

డెంకాడ బంగారమ్మ తల్లి వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: డెంకాడ గ్రామపంచాయతీలో వేంచేసియున్న శ్రీ బంగారమ్మ తల్లి 22వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన ఎడ్లబండ్ల పరుగు ప్రదర్శనను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలు స్థానికులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.