తన లవ్‌స్టోరీ రివీల్ చేసిన రింకూ సింగ్

భారత క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం జూన్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే 2022లో కరోనా సమయంలో ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు తమ మధ్య ప్రేమ మొదలైనట్లు రింకూ వెల్లడించాడు. ఫ్యాన్ పేజీలో ప్రియ ఫొటోను చూసి ఇష్టపడినట్లు పేర్కొన్నాడు. కాగా త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.