'వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి'
MDK: వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని, జీవో నెంబర్ 34ను అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేశారు. ఈ మేరకు మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. వికలాంగుల సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతిపత్రం సమర్పించారు. మూడు సంవత్సరాల క్రితం తీసుకువచ్చిన జీవో నేటికీ అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు