VIDEO: స్టేషన్ ఆవరణమంతా పచ్చదనం
PLD: పెదకూరపాడు పోలీస్ స్టేషన్ ఆవరణ పచ్చదనంతో కళకళలాడుతోంది. ఎస్సై గిరిబాబు చొరవతో సిబ్బంది అంతా కలిసి ప్రతిరోజూ మొక్కలు నాటుతూ స్టేషన్ పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చారు. మొక్కల వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందని, కాలుష్యం తగ్గుతుందని ఎస్సై పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.