ఇంకా హామీలు అమలు కాలేదు: విజయానందరెడ్డి

చిత్తూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల కావస్తున్నా ఇంకా పలు హామీలను అమలు చేయలేదని వైసీపీ నేత విజయానంద రెడ్డి ఆరోపించారు. 5, 6, 7 వార్డులలో గురువారం నిర్వహించిన బాబు షూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత మాజీ సీఎం జగన్‌కు దక్కిందన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.