కార్మికులకు పార్టీ అండగా ఉంటుంది: ఎమ్మెల్సీ
MHBD: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తీవ్రంగా విమర్శించారు. మహబూబాబాద్ పట్టణంలో వారు మాట్లాడుతూ.. డిపోల్లో పోలీస్ పహారా కారణంగా ప్రయాణికులు, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. శంకర్ గౌడ్ అంతిమ యాత్రను అడ్డుకోవడం దారుణమని ఆక్షేపించారు. కార్మికులకు పార్టీ అండగా ఉంటుందన్నారు.