16న విశాఖకు మంత్రి లోకేష్
VSP: రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం విశాఖపట్నం రానున్నారు. ఉదయం 9.45 గంటలకు న్యూఢిల్లీ నుంచి విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, అనంతరం రుషికొండ రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్తారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి అనంతరం భోగాపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి విజయవాడకు వెళ్లనున్నారు.