అక్రమంగా గ్యాస్ సిలిండర్లు వినియోగం..ఆరుగురుపై కేసు నమోదు

అక్రమంగా గ్యాస్ సిలిండర్లు వినియోగం..ఆరుగురుపై కేసు నమోదు

BHPL: ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్ సప్లై శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం BHPL పట్టణంలోని వాణిజ్య సముదాయాలు, హోటళ్లు సెంటర్ల పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 13 డొమెస్టిక్ సిలిండర్లు అక్రమంగా కమర్షియల్ వినియోగంలో ఉన్నట్లు గుర్తించారు. ఆరుగురు వ్యాపారుల పై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో సివిల్ సప్లై ఇన్స్‌పెక్టర్ భాస్కర్ రాజు, సురేందర్ ఉన్నారు.