ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్ గూడూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళ రాష్ట్రానికి శక్తి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలకు నాణ్యమైన ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. మహిళలను కోటిశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.