పాఠశాలను సందర్శించిన డీఈవో
MDK: తూప్రాన్ మండలం వట్టూరు ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ సందర్శించారు. మూతపడిన పాఠశాల ఐదేళ్ల తర్వాత ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. పాఠశాలలో మరమ్మతులు మౌలిక వసతులకు రూ. 2 లక్షలు మంజూరు కాగా పాఠశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.