పాలకుర్తిలో సావిత్రీబాయి ఫూలే వర్ధంతి వేడుకలు

JN: సామాజిక న్యాయం, మహిళా హక్కుల సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత సావిత్రీబాయి ఫూలే వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.