ఫ్రీ బస్.. ఎంతమంది ప్రయాణించారంటే?

కృష్ణా: మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభమైన తొలి 48 గంటల్లోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,64,674 మంది ప్రయాణించినట్లు రెండు జిల్లాల డీపీటీఓలు తెలిపారు. కృష్ణా జిల్లాలో 41,806 మంది మహిళలు, 868 మంది చిన్నారులు ఉచిత బస్సులను వినియోగించుకున్నారు. ఈ ప్రయాణాలకు గాను ఆర్టీసీకి రూ.14.95 లక్షలు చెల్లించనున్నట్లు కృష్ణా డీపీటీఓ కె. వెంకటేశ్వర్లు వెల్లడించారు.