నూతన PCCF సువర్ణను అభినందించిన మంత్రి సీతక్క

HYD: రాష్ట్ర సచివాలయంలో నూతన ప్రధాన అటవీ సంరక్షణాధికారి (PCCF)గా బాధ్యతలు చేపట్టిన జీ.సువర్ణ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె మంత్రి సీతక్కకు పుష్పగుచ్చం అందజేశారు. నూతన బాధ్యతల కోసం శుభాకాంక్షలు తెలుపుతూ, అడవుల సంరక్షణలో ఆమె విశేషంగా సేవలందించాలని మంత్రి ఆకాంక్షించారు.