804 మొబైల్ ఫోన్‌లను బాధితులకు అందజేసిన పోలీసులు
ATP: 'మీ మొబైల్ మీ ఇంటికి' కార్యక్రమం ద్వారా రూ. 1.60 కోట్లు విలువచేసే 804 ఫోన్లను అనంతపురం పోలీసులు బాధితులకు అందజేశారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు సిబ్బంది నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి వీటిని అప్పగించారు. ఇప్పటివరకు జిల్లాలో చాట్ బాట్, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రూ. 27.75 కోట్ల విలువైన 14,421 ఫోన్లు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.