తొర్రూరు డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

MHBD: తొర్రూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలకు చివరి అవకాశమని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 15, 16 తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతులతో కళాశాలను సంప్రదించాలని సూచించారు.