VIDEO: ఉగాది వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్
విశాఖ వీఎంఆర్‌డిఏ చిల్డ్రన్ ఏరినా వేదికగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలను జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.