'సీనియర్లను టెట్ నుంచి మినహాయించాలి'
ADB: సర్వీసులో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుంచి మినహాయించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. ఎస్టీఎఫ్ఎ పోరాట కార్యాచరణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లెటర్ క్యాంపెయిన్‌లో పాల్గొని మాట్లాడారు. సీనియర్ టీచర్లకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు.