30 ఏళ్లు పైబడిన వారందరికీ టెస్టులు చేయాలి: DMHO
WGL: జిల్లా కేంద్రంలోని DMHO కార్యాలయంలో DMHO డా. అప్పయ్య శనివారం సాయంత్రం వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా DMHO మాట్లాడుతూ.. మార్చి 2 నుంచి ప్రారంభం కానున్న 100 రోజుల ఆరోగ్య మిషన్‌లో ఎన్సీడీ (నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్) అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. 30 ఏళ్లు పైబడిన వారందరికి టెస్టులు చేయాలన్నారు.