యువకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి

కృష్ణా: అవనిగడ్డలో ఆకుల శ్రీనివాస్ అనే యువకుడిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. అవనిగడ్డ 2వ వార్డులో నివాసం ఉంటున్న శ్రీనివాస్‌ను స్థానికులు హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.