VIDEO: హుస్నాబాద్‌లో 12వ శతాబ్దం కాలభైరవ క్షేత్రం
SDPT: హుస్నాబాద్ మం. ఉమ్మాపూర్‌లోని మహాసముద్రం గుట్టల్లో 12వ శతాబ్దం నాటి అతి పురాతన చండీ సమేత కాలభైరవ క్షేత్రం కొలువైంది. ఈ ఆలయాన్ని రాణి రుద్రమదేవి కాలంలో నిర్మించినట్లు చెబుతున్నారు. ఈ క్షేత్రం దేశంలోని మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా భావిస్తారు. కాలభైరవ స్వామి బండ కింద నుంచి పారే జలాన్ని ఔషధ గుణాలతో కూడిన పవిత్ర జలంగా భక్తులు స్వీకరిస్తారు.