ఈ నెల 22 జాబ్ మేళా
WGL: ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 22న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మల్లయ్య తెలిపారు. సుమారు 60 ప్రముఖ ప్రైవేటు కంపెనీలు పాల్గొని వివిధ ఉద్యోగాలు అందజేస్తాయి. SSC, డిగ్రీ అర్హతలు కలిగిన 18-35 ఏళ్లలోపు యువతీ యువకులు అసలు ధ్రువీకరణ పత్రాలతో MLG రోడ్డులోని కార్యాలయంలో హాజరుకావాలని కోరారు.