VIDEO: అమ్మవారిని దర్శించుకున్న విద్యార్థులు
JGL: మల్యాల మండలం నూకపల్లి సరస్వతి దేవి ఆలయంలో ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా విద్యార్థులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వేడుకున్నారు.