1,64,382 గృహాలకు నూతన కుళాయి కనెక్షన్లు
సత్యసాయి: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. జల్ జీవన్ మిషన్ కింద 2026 మార్చి నాటికి 1,64,382 గృహాలకు నూతన కుళాయి కనెక్షన్లు కల్పించి రక్షిత మంచి నీటిని అందిస్తోంది. మోదీ సర్కార్ చేపట్టిన ఈ బృహత్తర పథకం ద్వారా మారుమూల పల్లెల్లో సైతం ఇంటింటికీ జల భరోసా లభిస్తోంది.