పత్తి రైతులకు మద్దతు ధర కష్టాలు
NRPT: జిల్లాలో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక వర్షపాతం, తుపానుల కారణంగా పంట నష్టం జరిగి దిగుబడి తగ్గింది. తేమ శాతంపై సీసీఐ ఆంక్షలు పెట్టడంతో పత్తి విక్రయించడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.