ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

NLR: ఉదయగిరి పట్టణంలోని ఎన్ బి ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఎంఈవో 1 టి. వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఆయన పాఠశాల రికార్డులు, విద్యార్థుల పఠన సామర్థ్యాలు పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలన్నారు. పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు.