VIDEO: చెన్నూరులో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
KDP: చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యాధికారుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. 'విజ్ఞానానికి అండగా నిలుద్దాం, ఆరోగ్యం కోసం కలిసి పని చేద్దాం' అని వారు వివరించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, బయటి తిండికి దూరంగా ఉంటూ ఇంట్లో వండినవి తినడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచిదని వైద్యాధికారులు సూచించారు.