'6 గ్యారెంటీలను అమలు చేయాలి'
ADB: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని సోనాల మండల బీజేపీ నాయకులు కోరారు. మంగళవారం తహసీల్దార్ మల్లేష్‌కు వినతి పత్రం సమర్పించారు. రైతుల ఇబ్బందులు, అర్హులైన వారికి పెన్షన్లు, గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు బొరె రవీందర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.