VIDEO: HIT TV కథనానికి స్పందించిన ప్రజా సంఘాలు
BHPL: సింగరేణి ఏరియాలో భారీ చోరీ జరిగినట్లు ఇవాళ HIT TVలో వచ్చిన కథనానికి ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా స్పందించారు. సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 24 గంటల సెక్యూరిటీ ఉన్న సంస్థలో ఇంత పెద్ద చోరీ ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఏరియా అధికారులు అధికారికంగా ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.