20 పంచాయతీలు కైవసం చేసుకున్న కాంగ్రెస్
KMM: నేలకొండపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు గాను 3 ఏకగ్రీవం కాగా.. 29 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాలకే పరిమితమైంది. సీపీఎం (కూటమి) 2, ఇతరులు 3 స్థానాలలో విజయం సాధించారు. దీంతో ఆ గ్రామాల్లోని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.