భార్య వరకట్నం తేలేదని భర్త వేధింపు

కరీంనగర్: జమ్మికుంట పట్టణానికి చెందిన శ్రీలత, వీణవంక గ్రామానికి చెందిన క్రాంతితో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదనంగా కట్నం తేవాలని భర్త క్రాంతి, అత్త తిరుపతమ్మలు నిత్యం వేధిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా తల్లి, కొడుకుపై కేసు నమోదు చేసినట్లు సీఐ వరంగంటి రవి తెలిపారు.