తండాలకు నీటి సరఫరా ఆరంభం
కృష్ణా: ఎ.కొండూరు పరిధిలోని కిడ్నీ బాధిత గిరిజన తండాల్లో ఇంటింటికీ స్వచ్ఛ జలాలను ట్రయల్ రన్‌లో భాగంగా అందించే కార్యక్రమం ఆరంభమైంది. కూటమి ప్రభుత్వం అత్యంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి గిరిజనులకు కృష్ణా జలాలు అందిస్తుంది. సిలికా, ఫ్లోరైడ్ కలిసిన నీటిని తాగడం వల్లే తాము కిడ్నీ వ్యాధుల బారినపడుతున్నామంటూ గిరిజనులు గత కొన్నేళ్లుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.