సొంతగూటికి చేరిన మాజీ జడ్పీటీసీ
SRD: హత్నూర మండలం తాజా మాజీ జడ్పీటీసీ పొట్ల చెరువు ఆంజనేయులు గురువారం బీఆర్ఎస్ సొంత గూటిలో చేరారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో పార్టీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. BRS తరపున ZPTCగా గెలుపొందినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీని వీడి మళ్లీ సొంత గూటిని చేరారు.