ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన పెండల కృష్ణ అనే రైతు పురుగుల మందు సేవించి శనివారం ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.