VIDEO: సీఎం పర్యటన.. భద్రతపై ప్రత్యేక సమీక్ష

VIDEO: సీఎం పర్యటన.. భద్రతపై ప్రత్యేక సమీక్ష

ములుగు జిల్లాలో సీఎం, మంత్రులతో సహా రాష్ట్రప్రభుత్వ ఉన్నతస్థాయి యంత్రాంగం మేడారంలో రెండురోజుల పాటు ఉండనున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆదివారం జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ఆధ్వర్యంలో భద్రతా చర్యలపై సమీక్ష చేసి, పటిష్ట ప్రణాళికను సిద్ధం చేశారు. సీఎం పర్యటన సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.