మున్సిపల్ బడ్జెట్ ఆమోదించిన కౌన్సిల్

మున్సిపల్ బడ్జెట్ ఆమోదించిన కౌన్సిల్

KMR: కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన శనివారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీకి సంబంధించి రూ. 70.86 కోట్ల వార్షిక బడ్జెట్‌ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే, బడ్జెట్ ఆమోదానికి ముందు వార్డుల్లోని పెండింగ్ సమస్యలపై కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు.