VIDEO: అగ్ని ప్రమాదంలో బూడిదైన గడ్డివాము
KRNL: గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు గడ్డివాముకు నిప్పు పెట్టారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.లక్ష విలువ చేసే పశుగ్రాసం పూర్తిగా కాలి బూడిదైందని బాధితుడు గోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. పశుగ్రాసం కోల్పోవడంతో పశువుల పోషణ కష్టమవుతుందని తెలిపారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.